President Message

Mr. Koti Reddy Kondu
- TASC President

ఉత్సాహాన్ని ఊపిరిగా మలుచుకుంటూ, చైతన్య గీతం పాడుకుంటూ భవితవ్యం లోకి ఆనందంగా ఆశల రెక్కలు సాచండంటూ కొత్త సంవత్సరం ఇస్తున్న సందేశంతో ముందుకు సాగబోయే దక్షిణ కాలిఫోర్నియా తెలుగు మితృలందరికీ ముందుగా 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు!.

కొత్త సంవత్సరం కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాటానికి మా సరికొత్త TASC కార్యనిర్వాహక బృందం సంసిద్ధమయింది.

2024 దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించటం అత్యంత గౌరవంగా భావిస్తున్నాను.

TASCలో నా ప్రస్థానం 2011 వ సంవత్సరంలో వాలంటీర్‌ గా ప్రారంభమైంది. గత 13 సంవత్సరాలుగా TASC కోసం అంకిత భావంతో వివిధ హోదాల్లో పని చేసాను.

ఈ సంవత్సరం ప్రతిష్టాత్మకమైన TASC సంస్థకి అధ్యక్షుడి హోదాలో పని చేయటం చాలా సంతోషకరంగా ఉంది.

2024 వ సంవత్సరం ఎన్నో అద్భుతమయిన కార్యక్రమాలు నిర్వహించి మరో విజయవంతమయిన సంవత్సరంగా మార్చాలని ఆకాంక్షిస్తున్నాను.

అమరేందర్ రెడ్డి కేతిరెడ్డి గారి నేతృత్వంలోని 2023 EC బృందం అద్భుతంగా పనిచేసినందుకు వారికి అభినందనలు, ధన్యవాదాలు .

2023 సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ మరో కొత్త అధ్యాయానికి స్వీకారం చుట్టబోతున్న 2024 సంవత్సరం మరింత ఆశాజనకంగా ఉండి కొత్త ఉత్సాహాన్ని, కొత్త ఊపిరిని, ఉత్తేజాన్ని ఇవ్వాలని కోరుకుందాం.

నా మీద కొండంత నమ్మకంతో 2024 సంవత్సరం దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించిన కార్యవర్గ సభ్యులకి (EC), సలహా సంఘానికి (AC) , ధర్మకర్తల మండలికి (BOT), నన్ను అడుగడుగునా ప్రోత్సహించిన దాతలకి, మితృలకి, వాలంటీర్లకి నా హృదయ పూర్వక ధన్యవాదాలు.

మీ అందరి సహాయ సహకారాలతో ఈ సంవత్సరం దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం అధ్యక్షుడిగా తెలుగు భాషకి ప్రాధాన్యతనిస్తూ సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమాలు, వినోద కార్యక్రమాలు, ఉద్యోగ, ఉపాధి సంబంధిత శిక్షణా తరగతులు, ఆరోగ్య అవగాహనా సదస్సులు, దిగ్విజయంగా నిర్వహించి టాస్క్ జయ కేతనం లాస్ ఏంజిలీస్ పురవీధుల్లో మరోసారి ఎగురవేసి ఉన్నత శిఖరాలకి చేర్చాలని ఆశిస్తున్నాను.

మా సరికొత్త TASC 2024 బృందాన్ని మనస్పూర్తిగా ఆశీర్వదించి 2024లో జరిగే అన్ని కార్యక్రమాలని విజయవంతం చేయటానికి మీ సహాయ సహకారాలని అందచేస్తారని ఆశిస్తున్నాను. 

మీ అందరికీ నా తరఫునా, మా కార్యవర్గం తరఫునా మరొక్కసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు !!!



 

 భవదీయుడు

 కోటి రెడ్డి కొండు

 వాలంటీర్ మరియు అధ్యక్షుడు

 తెలుగు అసోసియేషన్ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా (TASC)

 

 

My dear So Cal Telugu community,

First and foremost, I would like to wish you all a very Happy and Prosperous New Year 2024.

New Year brings new excitement and a new TASC Executive team with lot of high aspirations. I am humbled and honored to be the president of TASC for 2024.

My journey in TASC began as a volunteer, just like many of you. I joined TASC in 2011 and over the last 13 years, I served in various positions for TASC with a lot of passion.

Today, I am extremely happy to serve as the President of this prestigious organization TASC.

I have a lot of dedication to serve our community and hope to make 2024 a very grand and eventful year.

While President is the title, I am always a volunteer to TASC first. This is a great responsibility for me to help the organization in any way I can. I am ready to take on new challenges and make 2024 a grand year for TASC.

All of our previous TASC presidents and leadership team have worked very hard and done a phenomenal job in strengthening the organization.

Now the torch has been passed on to me, and I will uphold the core values of TASC to the best of my capabilities and support the community wherever and whenever needed.

We have a very motivated EC team for 2024 and we are planning to bring quality and innovative programs throughout the whole year. There will be balance between entertainment and our Telugu culture and heritage.

As always, living up to the TASC slogan (Language and tradition), I am proud to say that the TASC has been the torchbearer of promoting and passing the time-honored Telugu language, arts, culture and traditions to the younger generations and providing a platform for our local talent since 1971.

I would like to congratulate and thank the EC team of 2023 headed by Amarender Reddy Kethireddy for a fantastic job they have done in 2023.

I request all of our TASC members, senior leadership,, Advisory Council, Board of Trustees, Donors, Sponsors and Volunteers to guide and support us for another successful year.

Please bless our TASC 2024 team and let’s make all of the events in 2024 a grand success.

Best wishes once again, and looking forward to a wonderful and memorable 2024.

 

 Sincerely,

 Koti Reddy Kondu

 Volunteer and President

 Telugu Association of Southern California (TASC)

 

 

© 2015 Mana TASC. All rights reserved.